Ys Jagan : జగన్ పుట్టినరోజు నేడు జక్కంపూడి రాజా ఏం చేశాడో తెలుసా?

వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు

Update: 2025-12-21 03:57 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. జగన్ యాభై మూడో సంవత్సర పుట్టిన రోజు వేడుకలను విన్నూత్న తరహాలో నిర్వహించాలని గోదావరి జిల్లా పార్టీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా నలభై వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీని గోదావరి నది మధ్యలో ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

నది మధ్యలో...
డ్రోన్ నుంచి తీసిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్లెక్సీని ఏర్పాటు చేయడమే కాకుండా దాని చుట్టు నిలబడి జై జగన్.. జై వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు జరుపుకుంటున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ నేతలు నేడు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోనున్నారు.


Tags:    

Similar News