నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్‌ భేటీ

తాడేపల్లిలో నేడు వైసీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌ సమావేశం కానున్నారు

Update: 2026-01-20 03:36 GMT

తాడేపల్లిలో నేడు వైసీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌ సమావేశం కానున్నారు. నేడు తాడేపల్లిలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చంచనున్నారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ వంటి అంశంతో పాటు వరసగా జరుగుతున్న వైసీపీ కార్యకర్తల హత్యలపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అనేక అంశాలపై...
పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జగన్ పార్టీ నేతలతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలవిషయంలోనూ ముఖ్య నేతలతో జగన్ చర్చించే అవకాశముంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై పార్టీ నేతలతో నేడు జగన్‌ చర్చించనున్నారు. లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News