సీఎం జగన్‌కు వైద్య పరీక్షలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని రోజులుగా

Update: 2023-08-22 03:22 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లారు. ఎమ్మారై స్కాన్‌తో పాటూ ఆయన వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ల్యాబ్‌లో ఆయన సుమారు రెండు గంటలపాటు ఉన్నారు. జగన్ వెంట ఆయన భార్య భారతి రెడ్డి కూడా ఉన్నారు. పరీక్షల అనంతరం జగన్ మూడు గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.

విజయవాడలో నిర్వహించిన ఏపీ ఎన‍్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తామన్నారు. హెల్త్ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని.. 53 వేల మంది హెల్త్ సెక్టార్‌లో నియమించామని తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందుల గురించి ఎప్పుడూ సానుకూలంగా స్పందించామన్నారు సీఎం. ఎంతో నిజాయితీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చామని.. జీపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌కు రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్‌ వస్తుందన్నారు.


Tags:    

Similar News