సింగయ్య మృతి కేసులో నిందితుడిగా వైఎస్ జగన్

చీలి సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని

Update: 2025-06-23 04:00 GMT

చీలి సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం రాత్రి మీడియా ముందు వెల్లడించారు. ఈ సంఘటన జూన్ 18న గుంటూరు నగర శివార్లలోని ఏటుకూరు గ్రామ సమీపంలో జరిగింది. ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన వైఎస్ఆర్సీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లికి వెళ్లారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్, అలాగే కాన్వాయ్‌లో ఉన్నట్లుగా భావిస్తున్న నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనిలను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు ఎస్పీ తెలిపారు.

జూన్ 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డు బైపాస్ వద్ద ఈ సంఘటన జరిగిందని ఎస్పీ వివరించారు. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సింగయ్య అనే వృద్ధుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, డ్రోన్ కెమెరా దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించామని ఎస్పీ తెలిపారు.


Tags:    

Similar News