Ys Jagan : నేడు అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు

Update: 2026-03-25 02:22 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. అద్దంకి నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై జగన్ చర్చించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

పార్టీ బలోపేతానికి...
ఇటీవల కాలంలో వైఎస్ జగన్ నియోజకవర్గాల వారీగా నేతలతో, ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో అనుసరించాల్సిన విషయాలను జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గం పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకోనున్నారు.


Tags:    

Similar News