Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కర్నూలు జిల్లా చెన్నమ్మ కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన స్థానికులను మరో లారీ ఢీకొనింది.
ముగ్గురి మృతి...
స్థానికులను లారీ ఢీకొనడంతో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ దే తప్పని ప్రాధమికంగా నిర్ణయించారు.