పెద్దిరెడ్డి కంపెనీకి సుప్రీంకోర్టులో దక్కని ఊరట

వైసీపీ నేత పెద్దిరెడ్డి కంపెనీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు

Update: 2026-03-25 03:15 GMT

వైసీపీ నేత పెద్దిరెడ్డి కంపెనీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ వేసింది. పెద్దిరెడ్డి భార్య పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీఎల్ఆర్ కంపెనీ తరఫున పెద్దిరెడ్డి సతీమణి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులోనే విచారణ చేయించాలని...
రోడ్డు పనుల బిల్లులను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు ఆరోపణ చేస్తూ పిటీషన్ వేసినా సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. హైకోర్టులో ఇప్పటికే 12 కేసులు వేశామని పెద్దిరెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పినా రే హైకోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. విచారణకు నిరాకరించడంతో పిటిషన్ పెద్దిరెడ్డి ఉపసంహరించుకున్నారు.


Tags:    

Similar News