ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2023-05-02 02:24 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛనుదారులకు డీఏ 2.73% మంజూరు చేశారు. ఈ కొత్త డీఏ ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారు. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాలని నిర్ణయించారు.

22.75 శాతం డీఏగా...
ఈ కొత్త డీఏ తో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న డీఏ రావడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని కోరుతున్నారు.


Tags:    

Similar News