మస్కట్ లో చిక్కుకున్న సిక్కోలు వాసులు
మస్కట్ లో శ్రీకాకుళం జిల్లా కు చెందిన యువకులు కొందరు చిక్కుకున్నారు
మస్కట్ లో శ్రీకాకుళం జిల్లా కు చెందిన యువకులు కొందరు చిక్కుకున్నారు. పొట్టకూటి కోసం మస్కట్ వెళ్లిన 18 మంది సిక్కోలు యువకులు అక్కడే ఉండిపోయారు. అయితే మస్కట్ లో చిక్కుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తొమ్మిది మంది, కేరళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మరో 9 మంది ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఉపాధి కోసం...
వీరంతా ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లినట్లు చెబుతున్నారు. వెల్డింగ్ పనుల కోసం తీసుకెళ్లిన ఏజెంట్లు అక్కడే వదిలేయడంతో తమను రక్షించి భారత్ కు తిరిగి తీసుకు రావాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ కు బాధితుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియోలు పెట్టారు.