Andhrapradesh:స్పీకర్ విచారణకు దూరం
స్పీకర్ ఎదుటకు విచారణకు రావడం లేదని తమ్మినేని సీతారాంకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి లేఖ పంపారు.
anam ramanarayana reddy, ycp rebel mla, speaker, tammineni sitaram
Andhrapradesh:తాను స్పీకర్ ఎదుటకు విచారణకు రావడం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి లేఖ పంపారు. తాను మాట్లాడిన న్యూస్ క్లిప్పింగ్ కు సంంబంధించి ఆ యా సంస్థల సర్టిఫైడ్ కాపీలను కావాలని తాను కోరినట్లు ఆనం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అప్పటి వరకూ విచారణకు హాజరు కాబోనని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీలు కూడా...
అలాగే మండలి చీఫ్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని లేఖ రాశారు. దీంతో చివరి ఛాన్స్ అని నోటీసులు ఇవ్వడంతో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఈరోజు చర్య తీసుకునే అవకాశాలున్నాయి.