నేడు విజయసాయిరెడ్డి రాజీనామా
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ పదవికి ఆయన ఉదయం పది గంటల సమయంలో తన రాజీనామా లేఖను రాజ్యసభ వైఎస్ ఛైర్మన్ ధన్ ఖడ్ కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన విజయసాయిరెడ్డి నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు.
వ్యక్తిగత కారణాల వల్లనేనంటూ...
తన వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన నిన్ననే ఎక్స్ లో ప్రకటించారు. తన రాజీనామాకు ఎవరి ఒత్తిళ్లు కారణం కాదని, తాను మాత్రమే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. జగన్ కుటుంబం పట్ల విధేయత ప్రకటిస్తూనే ఆయన తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. జగన్ లండన్ పర్యటనలో ఉండగా విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయనను సంప్రదించేందుకు పార్టీ ముఖ్య నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం ఏడుకు పడిపోయినట్లయింది.