రాయచోటిలో వైసీపీ ఆందోళన

రాయచోటిలో వైసీపీ ఆందోళనకు దిగింది.

Update: 2025-12-31 07:58 GMT

రాయచోటిలో వైసీపీ ఆందోళనకు దిగింది. జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాయచోటి బంద్ కు వైసీపీ పిలుపు నిచ్చింది. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జిల్లాను మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో అన్ని రకాలుగా ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించిన తర్వాత మాత్రమే అన్నమయ్య జిల్లా ఏర్పడిందని తెలిపారు.

జిల్లా కేంద్రాన్ని తరలిస్తూ...
రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడాన్ని తాము అంగీకరించబోమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లా కేంద్రాన్ని తరలించిందని, ఇది రాజంపేటకు జరిగిన అన్యాయమేనని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లాను నిలబెట్టకుంటే మీసం తీసేసుకుంటానన్న మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తన సవాల్ కు కట్టుబడి ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.


Tags:    

Similar News