Breaking : మిధున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి పేరును కూడా చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో మిధున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిల్ ను...
దీంతో నేడు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ పార్ధివాల, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం విచారించింది. అయితే ఈ పిటీషన్ ను కొట్టివేసింది. అరెస్ట్ చేయకుండా ఈ కేసులో ఛార్జిషీటు ఎలా దాఖలు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. మిధున్ రెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. అది రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు పెట్టిందన్నారు. సిట్ విచారణకు హాజరైన మిధున్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారని పేర్కొంది. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసం మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది.