Duvvada : తిరుమలలో కనిపించిన దువ్వాడ, మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తిరుమలకు వచ్చారు. ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు.
duvwada srinivasa
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తిరుమలకు వచ్చారు. ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. అయితే ఆయన దివ్వెల మాధురితో కలసి తిరుమల దర్శనానికి రావడం చర్చనీయాంశమైంది. తన సతీమణి వాణితో కాకుండా మాధురితో కలసి రావడంతో తిరుమలలో చూసిన భక్తులు దీనిపై చర్చించుకుంటున్నారు.
ఆమెతో కలసి...
ఆయన మాధురితో కలసి స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఫొటోలు కూడా దిగారు. అనేక మంది వీరిద్దరూ ఉండటం చూశారు. తాను బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో మాడవీధుల్లో శ్రీవారి పల్లకీ ఉత్సవాన్ని కూడా చూశారు.