YSRCP : జెండా పీకేసీన మరో వైసీపీ ఎమ్మెల్యే

వైపీపీ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.

Update: 2024-01-12 03:37 GMT

ycp mla is preparing to change party. 

మరో వైపీపీ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో దొరబాబుకు వైసీపీ అధినాయకత్వం పిఠాపురం నుంచి టిక్కెట్‌ను నిరాకరించింది. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జిగా వంగా గీతను నియమించారు. దీంతో పెండెం దొరబాబు తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు పెండెం దొరబాబు పుట్టిన రోజు కావడంతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పుట్టిన రోజు నాడు..
పిఠాపురంలో పెద్దయెత్తున ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఫ్లెక్సీలలో ఎక్కడా వైసీపీ సింబల్ కానీ, జెండా కానీ లేకపోవడంతో ఆయన పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతుంది. దొరబాబు పార్టీ మారతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్లనున్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆయన ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. వారి కోసం దొరబాబు భారీ విందును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News