వైఎస్‌ జగనే.. మళ్లీ సీఎం: సజ్జల

రాబోయే ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. 175 కి 175 సీట్లు దక్కించుకునేలా అడుగులు

Update: 2023-06-14 12:26 GMT

ఇటీవల విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో సెంట్రల్‌ హోమ్‌ మినిస్టర్‌ అమిత్‌ షా చేసిన కామెంట్స్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కాదన్నట్టుగా అమిత్‌ షా మాట్లాడారంటూ మండిపడ్డారు. పార్టీ పరంగా అమిత్‌ షా విమర్శలు చేశారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు చదివారని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్దిష్టమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదన్నారు. పవన్‌ వాయిదా వేసుకుంటూ యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే రెండుసార్లూ చంద్రబాబుని పవన్‌ నెత్తిన పెట్టుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కోసమే పవన్‌ పని చేస్తున్నారని అన్నారు.

బీసీ కులాల కోరికలు తీర్చే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని, వెనుకబడిన కులాలకు వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టకముందు బీసీ డిక్లరేషన్‌ ఇస్తే.. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడరని అన్నారు. సీఎం జగన్‌ అధికారంలో వచ్చాక మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేసి చూపించారని సజ్జల తెలిపారు. రాష్ట్రంలోని జనాభా దామాషా ప్రకారం.. సీఎం జగన్‌ అందరికీ న్యాయం చేశారని తెలిపారు. సోషల్‌ జస్టిస్‌ అమలు చేయకపోతే సమాజానికి మంచిది కాదని, ప్రజల తిరుగు బావుట ఎగరవేస్తారని అన్నారు. అందరి చేతుల్లో అధికారం.. అనే లక్ష్యంతో సీఎం జగన్‌ ముందడగులు వేశారని, రాబోయే ఐదారేళ్లలో ఎంతో మార్పు వస్తుందన్నారు.

కేవలం ఓ నలుగురు కూర్చుని రాజకీయం చేస్తామంటే కుదరదన్నారు. పేద విద్యార్థులు.. సంపన్న విద్యార్థులతో కలిసి విద్యను అభ్యసించేలా కృషి చేస్తున్నామని, స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి సెల్ఫ్‌ రెస్పెక్ట్‌తో పాఠశాలలకు వెళ్లేదా ఫెసిలిటీస్‌ కల్పిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనో సామాజిక న్యాయం ఎంతో వేగంగా జరిగిందన్నారు. ఈ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని సజ్జల అన్నారు. మహిళా సాధికారతకు సీఎం జగన్‌ ఎంతో కృషి చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. 175 కి 175 సీట్లు దక్కించుకునేలా అడుగులు వేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News