పవన్‌కు అదొక్కటే తెలుసు: ఎంపీ మోపిదేవి

అమర్నాథ్‌ హత్యకు కులం రంగు, పార్టీ రంగు పులిమి చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చోటా

Update: 2023-06-20 12:38 GMT

విద్యార్థి అమర్నాథ్‌ హత్య రెండు కుటుంబాలకు చెందిన సమస్య అని, ఇందులో కులాలకు, పార్టీలకు ఎలాంటి ప్రమేయం లేదని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. విద్యార్థి అమర్నాథ్‌ హత్య దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సర్కార్‌ స్పందించి, 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయించిందన్నారు. ప్రభుత్వ పరంగా అమర్నాథ్‌ కుటుంబానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. అమర్నాథ్‌ హత్యకు కులం రంగు, పార్టీ రంగు పులిమి చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చోటా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు. వీలైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ.. ఇలా శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని చంద్రబాబుకు మోపిదేవి సూచించారు.

కులాల మధ్య చంద్రబాబు నిప్పు రాజేస్తున్నాడని మండిపడ్డారు. ఏం పని లేఖ ఖాళీగా కూర్చున్న చంద్రబాబు.. ఎవరు పిలుస్తారా? ఎక్కడికి వెళ్దా? అని ఎదరుచూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నాని మోపిదేవి మండిపడ్డారు. చంద్రబాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు కుట్రలు, కుయుక్తులన్నీ ఆయన ఉంటున్న అక్రమ ఇంటి నుంచే జరుగుతున్నాయంటూ విమర్శించారు. గతంలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోతే వారింటికి వెళ్లి పరామర్శించావా చంద్రబాబు? అని మోపిదేవి ప్రశ్నించారు. 2 నెలల కిందట టీడీపీ కౌన్సిలర్‌ హత్యకు కనీసం ఆ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించలేదన్నారు.

చంద్రబాబు సతీమణి ప్రస్తావన తెచ్చారని ఆయన బోరున ఏడ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి తమ కుటుంబ సభ్యుల పేరు ఎత్తే అర్హత లేదన్నారు. తమ కుటుంబాల గురించి మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ లాగా తనకు ప్యాకేజీ డబ్బులు రావడం లేదన్నారు. తన కష్టార్జితాన్ని తీసుకువెళ్లి అమర్నాథ్‌ కుటుంబానికి ఇచ్చి అండగా నిలిచానన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుని పవన్‌ చదువుతాడని, అతడికి వాస్తవాలు తెలియవని మోపిదేవి వెంకటరమణ అన్నారు. మత్స్యకారుల జీవితాలను పైకి తీసుకొచ్చేందుఉక రావడానికి సీఎం జగన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారుల సమస్యలు పవన్‌కు ఏం తెలుసునని మోపి దేవి ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని పవన్‌, లోకేష్‌ చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు.

Tags:    

Similar News