అమరావతిపై జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అమరావతిపై సంచలన కామెంట్స్ చేశారు.
చర్చకు నేను రెడీ.. డేట్ నువ్వు ఫిక్స్ చేయ్: మంత్రి జోగి
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అమరావతిపై సంచలన కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి ఒక కారణమని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారని, కానీ మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు అంగీకరించలేదని, అందులోనూ అమరావతి ప్రజలు అస్సలు అంగీకరించలేదని జోగి రమేష్ తెలిపారు.
వైసీపీ వ్యతిరేకం కాదని...
ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామన్న జోగి రమేష్ అమరావతి నిర్మాణానికి వైసీపీ వ్యతిరేకం కాదని, అమరావతిని జగన్ ముఖ్యమంత్రి అయితే అద్భుతంగా డెవలెప్ చేస్తారని తెలిపారు. చంద్రబాబు కూడా తాము చెప్పినట్లే విశాఖ ఆర్థిక రాజధాని అని చెబుతున్నారని, అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమవ్వడం కూడా కరెక్ట్ కాదని జోగి రమేష్ అభిప్రాయపడ్డారు.