Alla Nani :ఆళ్లనాని టీడీపీలో చేరిక నేడు
వైసీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలోకి చేరనున్నారు
వైసీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలోకి చేరనున్నారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి కొంతకాల క్రితం రాజీనామా చేసిన ఆళ్లనాని టీడీపీలో చేరడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. స్థానిక నేతలు ఆళ్ల నాని చేరికను అంగీకరించలేదు. దీంతో పార్టీ నాయకత్వం వారిని ఒప్పించి నానిచేరికకు మార్గం సుగమం చేసింది.
కొంతకాలంగా ఎదురు చూపులు...
టీడీపీలో చేరిక కోసం గత కొంతకాలంగా ఆళ్లనాని ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధినేత నుంచి పిలుపు వస్తుందని కాలం గడిపేశారు. ఏలూరు నియోజకవర్గంతో పాటు బలమైన సామాజికవర్గం నేత తమకు అవసరం అని భావించిన టీడీపీ అధినాయకత్వం ఆళ్ల నాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన ఈరో్జు రాత్రికి టీడీపీలో చేరనున్నారు.