YSRCP : నేడు వైసీపీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం
నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించనున్నారు. పదిహేనేళ్ల క్రితం 2011 మార్చి 12న వైసీపీని ఇడుపులపాయలో జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఒంటరిగా బరిలోకి దిగి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓటమి చెందగా, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
అన్ని పార్టీ కార్యాలయాల్లో...
నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో వైసీపీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. అన్ని కార్యాలయాల్లో నేతలు పార్టీ జెండాలు ఎగురవేస్తారు. వైసీపీ జిల్లా కార్యాలయాలను అలంకరించారు. పెద్దయెత్తున కార్యకర్తలు, నేతలు చేరుకుంటుండటంతో పార్టీ నేతలు కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలలో పాల్గొంటారు.