Ys Jagan : జగన్ నెల్లూరు పర్యటన వాయిదా

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దయింది.

Update: 2025-07-02 03:11 GMT

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దయింది. సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ నల 3వ తేదీన జగన్ నెల్లూరుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే హెలిప్యాడ్ కు అనుకూలమైన స్థలం దొరకకపోవడంతో ఈ పర్యటన వాయిదా పడింది. హెలిప్యాడ్ వద్ద ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని, మరో పది రోజుల్లో జగన్ ఎప్పుడు పర్యటించేది తెలియజేస్తారన్నది పార్టీ వర్గాలు వెల్లడించాయి.

త్వరలో కొత్త తేదీ...
త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు సరైన స్థలం ఇవ్వకపోవడంతోనే పర్యటన రద్దు చేసుకున్నామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ జైలు వద్దకు వస్తే మళ్లీ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించి పోలీసులు కూడా సరైన స్థలం చూపించడం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద జగన్ పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.


Tags:    

Similar News