Ys Jagan : నేడు గుంటూరు జిల్లా నేతలతో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, పంచాయతీ ఛైర్మన్లతో జగన్ సమావేశం కానున్నారు.
పార్టీని బలోపేతం చేసే అంశంపై...
పార్టీని బలోపేతం చేసే అంశంపై వారితో చర్చించనున్నారు. వరసగా జిల్లాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న జగన్ నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలియజేయనున్నారు.