Ys Jagan : నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. నిన్న బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్ నేడు ఎంపిక చేసిన జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అవుతున్నారు.
భరోసా ఇచ్చేందుకు
ఈ సమావేశానికి ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లను ఆహ్వానించారు. ఈసారి అధికారం మనదేనని, ఎవరూ పార్టీని వీడి వెళ్లవద్దని, అధికారంలోకి వస్తే తిరిగి పదవులు ఇస్తామన్న భరోసా జగన్ ఇచ్చేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు.