Ys Jagan : నేడు కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం
వైసీపీ అధినేత జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన నేతలకు ఆహ్వానం పంపారు. జిల్లా నేతలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్ లతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
అధికారంలోకి రాగానే...
వచ్చేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే పార్టీని నమ్ముకున్న వారికే తిరిగి పదవులు దక్కుతాయని జగన్ చెప్పనున్నారు. ప్రలోభాలకు, పదవుల కోసం లొంగితే అది తాత్కాలికమేనని ఆయన గుర్తు చేయనున్నారు. ప్రతి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు ముఖ్యనేతలతో జగన్ సమావేశమై వారి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.