Ys Jagan : నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం

వైసీపీ అధినేత జగన్ నేడు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు

Update: 2025-05-08 02:54 GMT

వైసీపీ అధినేత జగన్ నేడు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఉదయం పదిన్నర గంటలకు సమావేశం జరుగుతుంది. నిన్న పార్లమెంటరీ పరిశీలకులతో సమావేశమైన జగన్ నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. త్వరలో వచ్చేది మనదే అధికారం అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు.

భరోసా నింపేందుకే...
వివిద మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వారికి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి పదవులు ఉంటాయన్న భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారని తెలిసింది. జగన్ నిర్వహించే ఈ సమావేశం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో భరోసా నింపేందుకేనని, అందుకే ఎంపిక చేసిన కొన్ని మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులనే ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది.


Tags:    

Similar News