Ys Jagan : గవర్నర్ ను కలిసిన జగన్ దంపతులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ ను జగన్ దంపతులు కలిశారు.

Update: 2025-07-28 12:08 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ ను జగన్ దంపతులు కలిశారు. గవర్నర్ తో భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిన్న భారతి సిమెంట్స్ లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారుల సోదాలు జరిపిన నేపథ్యంలో ఈ భేటీ కి ప్రాధాన్యత ఏ్రపడిందని చెబుతున్నారు.

మర్యాదపూర్వక భేటీ అంటున్న...
అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆయనను పరామర్శించేందుకు జగన్ దంపతులు వెళ్లారని అంటున్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజా పరిణామాలను గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంటుందని అన్నారు.


Tags:    

Similar News