బనకచర్లప్రాజెక్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు
పోలవరం -బనకచర్లప్రాజెక్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
పోలవరం -బనకచర్లప్రాజెక్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తగినంత నీళ్లులేకుండా నీటిని మళ్లించడం సాధ్యం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్నినిర్ధారించకుండా బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలనుకోవడం పొరపాటు అని జగన్ అన్నారు. పోలవరం ఎత్తు విషయంలో చంద్రబాబు రాజీపడ్డారని, 45.72 అడుగులు ఎత్తు నుంచి పోలవరాన్ని41.72 అడుగులుకు తగ్గించారని, తగినంత నీటి నిల్వలు లేకుండా బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లను మళ్లించడం సాధ్యం కాదని జగన్ అన్నారు.
సాధ్యం కాదంటూ...
మిగులు జలాలు లేకుండా బనకచర్ల నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. ఏపీకి ఇంద్రావతి నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదని, కేంద్రం మద్దతుతో ఛత్తీస్ ఘడ్ నీటిని నిలిపేసిందన్నారు. ప్రాణహిత నుంచి నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారిందన్న జగన్ పోలవరం ఎత్తు తగ్గితే నీటికి కృష్ణాకు తరలించే అవకాశం లేదని జగన్ అన్నారు. మిగులు జలాలు లేకుండా బనకరచర్ల ఎలా నిర్మిస్తారని, ఎలా నీళ్లు తరలిస్తారని, ఎనభై వేల కోట్ల ప్రజాధనం వృధా కాదా? అని ప్రశ్నించారు. సాధ్యం కాని ప్రాజెక్టులతో చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.