Ys Jagan : వరద బాధితులకు జగన్ సాయం ఎంతో తెలుసా?
వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ కోటి రూపాయల సాయాన్ని ప్రకటించారు.
js jagan
వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ కోటి రూపాయల సాయాన్ని ప్రకటించారు. విజయవాడ వరదలపై అందుబాటులో ఉన్న నేతలతో ఆయన వరద పరిస్థితిపై సమీక్ష చేశారు. తాను నిన్నటి పర్యటనలో వరద బాధితులు పడుతున్న ఆవేదనను చూశామనని తెలిపారు. తాను ప్రకటించిన కోటి రూపాయల నగదును ఏ రూపంలో ఎలా ఇవ్వాలన్నది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
చంద్రబాబుది అంతా షో...
విజయవాడలో చంద్రబాబు షో చేయడం తప్ప ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఆయన వెంటే అధికార యంత్రాంగం ఉంటే ఇక క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతాయని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సహాయక కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని జగన్ ఆరోపించారు.