హిందూపురం టీడీపీ కైవసం
హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని గెలుచుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన రమేష్ ఎన్నికయ్యారు
హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని గెలుచుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన రమేష్ ఎన్నికయ్యారు. హిందూపురంలో వైసీపీ నుంచి టీడీపీలోకి సభ్యులు వచ్చారు. దీంతో టీడీపీ సభ్యుల బలం పెరిగింది. రెండు వర్గాలు క్యాంప్ లను నిన్నటి వరకూ నడిపాయి. నేరుగా మున్సిపల్ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకున్నారు.
బాలకృష్ణ దగ్గర ఉండి...
ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే చివరకు టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడే ఉండి వార్డు సభ్యులను వెంట తీసుకెళ్లి మరీ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. దీంతో హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగిరినట్లయింది.