మరో అల్పపీడనమట

తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ

Update: 2023-07-21 11:04 GMT

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో అల్ప పీడనం ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, అదే ప్రాంతంలో ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి కూడా స్థిరంగా కొనసాగుతుండడంతో, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాగల 5 రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అత్యవసరమైతేనే బయటకు ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు హెచ్చరించింది. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ పోటెత్తుతోంది. తూము ద్వారా అధిక మొత్తంలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఏపీలో కోస్తా రాయలసీమల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.


Tags:    

Similar News