Weather Report : వర్షం అంటారు... ఉక్కపోతతో చంపేస్తుందేందయ్యా సామీ

వాతావరణ శాఖ వర్షం కురుస్తుందని చెబుతుంది. మరొకవైపు ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

Update: 2025-06-02 03:50 GMT

వాతావరణ శాఖ వర్షం కురుస్తుందని చెబుతుంది. మరొకవైపు ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఉక్కపోత మాత్రం వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక చోట్ల జోరు వానలు పడతాయని కూడా తెలిపింది. పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల పాటు వర్షాలుపడనున్నాయనిచెప్పింది.

ఈ జిల్లాల్లో వర్షాలు...
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నేడు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఈ నెల రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బలమైన గాలులతో...
తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల,నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తడిసినధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్న నేపథ్యంలో మరోసారి వర్ష సూచనతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేదు.
Tags:    

Similar News