Weather Report : చల్లటి వాతావరణం.. జూన్ మొదటి వారంలోనే ఇలా ఎందుకంటే?
వాతావరణ కేంద్రం మాత్రం రోజూ వర్షాలు పడతాయని చెబుతుంది. ఉష్ణోగ్రతలు మాత్రం గణనీయంగా తగ్గాయి
వాతావరణ కేంద్రం మాత్రం రోజూ వర్షాలు పడతాయని చెబుతుంది. ఉష్ణోగ్రతలు మాత్రం గణనీయంగా తగ్గాయి. ఈసారి మే నెలలో పెద్దగా ఎండల బాధ లేకుండా ప్రజలు తప్పించుకోగలిగారు. యాభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తొలుత అంచనా వేసినా నలభై మూడు డిగ్రీలకు దాటలేదు. అదీ కూడా ఏప్రిల్, మే నెలలో కాస్త భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఈ ఏడాది ఎండలు అధికంగాఉంటాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు మాత్రం చూపించలేదు. నిజంగా ప్రజలు ఒకరకంగా ఎండ వేడిమి నుంచి ఈ ఏడాది నుంచి తప్పించుకున్నట్లే. రోహిణి కార్తెలో అయితే అకాల వర్షాలతో చల్లటి వాతావరణం ఏర్పడింది. రుతుపవనాలు త్వరగా రాష్ట్రాల్లోకి ప్రవేశించడంతో పాటు, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.
తగ్గనున్న ఉష్ణోగ్రతలు...
ఇక మరో రెండు రోజుల పాటు ఆంధ్ర్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని తెలిపిదంది. వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రధానంగా నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనమస, కాకినాడ, అనకాపల్లి, విశాఖ పట్నంలలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే ఏలూరు, అల్లూరు సీతారమరాజు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.
తెలంగాణలో రెండు రోజులు...
తెలంగాణ విషయానికి వస్తే రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది.గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయే అవకాశముందని కూడా పేర్కొంది. పలు చోట్ల 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేటర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.