కొల్లేరుకు పెరుగుతున్న నీటి ఉధృతి

కొల్లేరుకు నీటి ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా కొల్లేరుకు వరద నీరు చేరుతుంది.

Update: 2025-08-16 07:52 GMT

కొల్లేరుకు నీటి ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా కొల్లేరుకు వరద నీరు చేరుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో కొల్లేరు నీటిమట్టం పెరుగుతుంది. దీంతో కొన్ని గ్రామాల్లోకి వరద నీరు కూడా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ గ్రామాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు.

గ్రామాల మధ్య రాకపోకలకు...
మరొకవైపు కొల్లేరుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో మండవల్లి మండలం పెద్ద ఎడ్లగాడు - పెనుమాక లంక రహదారిపై కొల్లేరు ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని ఇలానే కొనసాగితే గ్రామాల మధ్య రాకపోకలు నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


Tags:    

Similar News