ఫిబ్రవరి 23న ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ఫిబ్రవరి 12వ తేదీకి

Update: 2022-01-23 11:43 GMT

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్రప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

కానీ కేంద్రం ఎంతకీ దిగి రాకపోవడంతో ఉద్యమం అలాగే కొనసాగింది. తాజాగా తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ఫిబ్రవరి 12వ తేదీకి ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తికానున్న సందర్భంగా కోటిసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనుంది. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకూ కోటి సంతకాల సేకరణ, 12న 365 జెండాలతో నిరసన, ఫిబ్రవరి 13వ తేదీన విశాఖలోని బీజేపీ కార్యాలయం ముట్టడి, ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.


Tags:    

Similar News