కేంద్ల్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కొత్త తరహా యుద్ధం

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ కేంద్ర మంత్రులకు ఈమెయిల్స్ పంపుతున్నారు

Update: 2022-02-18 04:53 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విన్నూత్న నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ కేంద్ర మంత్రులకు ఈమెయిల్స్ పంపుతున్నారు. ఇప్పటి వరకూ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని వివిధ రూపాల్లో కార్మికులు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవం రోజున విన్నూత్నంగా నిరసన తెలియజేయాలని భావించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ నిరసనను ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు.

ఈ మెయిల్స్ ద్వారా....
కేంద్రమంత్రులకు ఈ మెయిల్స్, వాట్సాప్ ల ద్వారా " స్టాప్ సేల్ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్" అంటూ మెయిల్స్ పంపుతున్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, రాందాస్ లకు వేల సంఖ్యలో ఈమెయిల్స్ ను పంపారు. ఈ నెల 21వ తేదీ వరకూ ఇలా పంపుతూనే ఉంటామని కార్మికులు చెబుతున్నారు. తమ పోరాటం అన్ని మార్గాల ద్వారా చేస్తామని, ప్లాంట్ ను రక్షించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని వారు చెబుతున్నారు.


Tags:    

Similar News