రికార్డులో రారాజు... విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డును సృష్టించింది. ఒకరోజు ఉత్పత్తిని అధికంగా చేసి గత రికార్డులను బద్దలు కొట్టేసింది.

Update: 2022-02-09 08:32 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డును సృష్టించింది. ఒకరోజు ఉత్పత్తిని అధికంగా చేసి గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నేస్ -1 గోదావరి లో అత్యధికంగా ఉత్పత్తి జరిగింది. మంగళవారం ఈ రికార్డు విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటుచేసుకుంది. ఒక రోజులో అత్యధికంగా 7,620 టన్నుల ఉత్పత్తి జరిగింది.

ఉత్పత్తిలో...
గతంలో ఏప్రిల్ 16వ తేదీ 2020 న విశాఖ స్టీల్ ప్లాంట్ లో అత్యధికంగా 7,550 టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక రికార్డు. అయితే ఈ రికార్డును స్టీల్ ప్లాంట్ నిన్న అధిగమించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరించాలని సిద్దమయింది.
ఆందోళనలు....
దీనిపై గత కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమకు సెంటిమెంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని కోరుతున్నారు. ఈ నెల 23వ తేదీన బంద్ కు కూడా పిలుపు నిచ్చారు. ఒక వైపు కార్మికుల ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఉత్పత్తిని రికార్డు స్థాయిలో చేయడం విశేషం.


Tags:    

Similar News