Breaking : భారీ వర్షాలతో నీటిలో గ్రామం.. ప్రజల ఆందోళన
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలకు ఒక గ్రామం జలదిగ్భంధనంలో చిక్కుకుంది.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలకు ఒక గ్రామం జలదిగ్భంధనంలో చిక్కుకుంది. బేస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో ఉన్న కుటుంబాలు భయాందోళనల మధ్య ఉన్నారు. దీంతో అధికారులు ఆ గ్రామం నుంచి ప్రజలను బయటకు రక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సహాయక బృందాలు...
ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు అక్కడకు బయలుదేరి వెళ్లాయి.కాలువలను ఆక్రమించినందునే తమ గ్రామం మునకకు గురయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పడవల ద్వారా ప్రజలను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.