విజయవాడ - హైదరాబాద్ హైవే పై భారీ ట్రాఫిక్ జామ్

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Update: 2021-12-06 04:01 GMT

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు కార్లు లారీని ఢీకొనడంతో ఈ సమస్య ఏర్పడింది.

లారీని ఢీకొట్టడంతో....
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై ట్రాఫిక్ నిలిచిపోయింది. సోమవారం కావడంతో వాహనాల రద్దీ జాతీయ రహదారిపై ఎక్కువగా ఉంది. ఒక లారీ చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా రెండు కార్లు వచ్చి లారీని ఢొకొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News