పీఎస్‌ఆర్ కు పథ్నాలుగు రోజుల రిమాండ్
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. పథ్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది. వచ్చే నెల ఏడో తేదీ వరకూ పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ విధించింది. తన కేసులో తన వాదనలను తానే వినిపించుకున్నారు. ముంబయి నటి కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన తెలిపారు ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం అందుకు తగిన ఆధారాలున్నాయని తెలిపారు.
ముంబయి నటి కేసులో...
ముందుగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత పీఎస్ఆర్ ఆంజనేయులను కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకు వచ్చిన సీఐడీ పోలీసులు పీఎస్ఆర్ ఆంజనేయులును నిన్న ఏడు గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు నేడు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.