Godavari : గోదావరి పుష్కరాల పనులు నేటి నుంచి ప్రారంభం
రాజమండ్రిలో నేడు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేయనున్నారు
రాజమండ్రిలో నేడు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. 2027లో గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రాజెక్టకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు పవన్ కల్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురంద్రేశ్వరి, మంత్రి కందుల దుర్గేశ్ లు హాజరు కానున్నారు. రాజమండ్రి నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేలా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 97 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వంభాగస్వామ్యంతో 127 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజమండ్రి హేవలాక్ వంతెనతో పాటు పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. రాజమండ్రిలోని పపుష్కరాల రేవును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు.