ఫార్మాసిటీలో విషవాయువు లీక్ .. ఇద్దరి మృతి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీకయి ఇద్దరు మరణించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీకయి ఇద్దరు మరణించారు. ఈ ఘటనతో విషాదం అలుముకుంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఉన్న ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో నిన్న అర్ధరాత్రి విషవాయువు లీకయింది. ఈ ఘటనలో ఆ సమయంలో ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న చంద్రశేఖర్ తో పాటు కుమార్ అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
గాయపడిన వారిని...
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షీలానగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బంధువులు మాత్రం కంపెనీ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని అంటున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.