నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక
నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. మూడు సార్లు కోరం లేక వాయిదా పడిన ఈ ఎన్నిక నేడు జరుగుతుందా? లేదా? అన్న అనుమానంగా ఉంది. ఇప్పటికే కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడి శెట్టి రాజా చలో తుని కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి తమ అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు.
హౌస్ అరెస్ట్ లు...
వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. జక్కంపూడి రాజా, మార్గాని భరత్, వేణుగోపాల్ వంటి వారిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న పది మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో కోరం లేదని వాయిదా వేశారు. నేడు కూడా వైసీపీ కౌన్సిలర్లు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.