తుని మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా
తుని మున్సిపల్ రాజకీయం మలుపు తిరిగింది. తుని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుధారాణి రాజీనామా చేశారు.
తుని మున్సిపల్ రాజకీయం మలుపు తిరిగింది. తుని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుధారాణి రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసే అవకాశముంది. తన ఇంటిపై దాడి చేసి తిరిగి తనపైనే కేసులు నమోదు చేయడమే కాకుండా తనను ఆ కేసులో ఏ1 నిందితురాలిగా చేర్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైస్ ఛైర్మన్ పదవి కోసం...
గత కొన్ని రోజులుగా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కోసం హైడ్రామా నడుస్తుంది. టీడీపీ, వైసీపీ బలాబలాలను నిరూపించుకోవడానికి ఎవరి ప్లాన్ వారు వేసుకుంటున్నారు. నాలుగు సార్లు వైస్ ఛైర్మన్ పదవి ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. అప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీకి పది మంది, వైసీపీకి 17 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ వైస్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకోవడం కోసం కుట్రలు పన్నుతున్నారని, అందుకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు.