Tirumala : వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ?

తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు

Update: 2023-12-19 07:15 GMT

vaikuntha ekadashi arrangements

తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పది రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. డిసెంబరు 23న రాత్రి 1:45 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది.

పది రోజుల పాటు...
జనవరి 1న రాత్రి 12 గంటలకు ఉత్తర ద్వార దర్శనం పూర్తి అవుతుంది. ఈ నెల 22న సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలో 9 ప్రాంతాల్లో టోకెన్లు జారీ చేస్తారు. మొత్తం 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు పూర్తి అయ్యేంత వరకు జారీ చేయనున్నారు. ఉత్తర ద్వార దర్శనం జరిగే పది రోజుల పాటు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.


Full View


Tags:    

Similar News