రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు

టిటిడి షెడ్యూల్ ప్రకారం.. బ్రహ్మోత్సవాల అంకురార్పణకు ముందు ఈ నెల 20న ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు..

Update: 2022-09-02 14:30 GMT

రెండేళ్ల తర్వాత శ్రీవారి భక్తుల సమక్షంలో తిరుమల వెంకన్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా.. భక్తులు లేకుండానే వెంకన్న బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఏడాది కరోనా విజృంభణ తగ్గడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తుల కళ్లెదుటే నిర్వహించేందుకు సిద్ధమైంది టిటిడి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్ ను టిటిడి ప్రకటించింది.

టిటిడి షెడ్యూల్ ప్రకారం.. బ్రహ్మోత్సవాల అంకురార్పణకు ముందు ఈ నెల 20న ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీవారి ఆల‌యంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కోయిల్ అళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. 26వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహనసేవల్లో తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో స్వామివారి వాహనసేవలు
సెప్టెంబ‌ర్ 26 బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

సెప్టెంబ‌ర్ 27 ధ్వ‌జారోహ‌ణం, పెద్ద శేష వాహ‌న సేవ‌

సెప్టెంబ‌ర్ 28 చిన్న శేష వాహ‌నం, స్న‌ప‌న తిరుమంజ‌నం, హంస వాహ‌న సేవ‌

సెప్టెంబ‌ర్ 29 సింహ వాహ‌న సేవ‌, ముత్య‌పు పందిరి వాహ‌న సేవ‌

సెప్టెంబ‌ర్ 30 క‌ల్ప‌వృక్ష వాహ‌న సేవ‌, స‌ర్వ భూపాల వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్ 01 మోహిని అవ‌తారంలో స్వామి వారి ద‌ర్శ‌నం, గ‌రుడ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్ 02 హ‌నుమంత వాహ‌న సేవ‌, గ‌జ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్ 03 సూర్యప్ర‌భ వాహ‌న సేవ‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్ 04 ర‌థోత్స‌వం, అశ్వ వాహ‌న సేవ‌

అక్టోబ‌ర్ 05 చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం

Tags:    

Similar News