Vijayanagaram : విధినిర్వహణలో బస్సు కండక్టర్ గుండెపోటుతో మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో బస్ కండక్టర్ దాసు గుండెపోటుతో మృతి చెందాడు
విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో బస్ కండక్టర్ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. సాలూరు నుండి విశాఖపట్నానికి వెళుతున్న బస్‌లో కండక్టర్ దాసు ప్రయాణికుల టికెట్లు చెక్ చేస్తుండగా, బస్ కాంప్లెక్స్ దాటిన కొద్దిసేపటికే ఆయన సీట్లో కూలిపోయాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించినా...
వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందించేలోపే దాసు ప్రాణాలు కోల్పోయారు. దాసుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హార్ట్ ఎటాక్ వల్లనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దాసు కుటుంబంలో మాత్రమే కాకుండా విజయనగరం జిల్లా ఆర్టీసీ సిబ్బందిలో విషాదం అలుముకుంది.