లంకమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ సమస్య
లంకమలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో ట్రాఫిక్ సమస్య తెలెత్తింది.
కడప జిల్లాలోని లంకమలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో ట్రాఫిక్ సమస్య తెలెత్తింది. భారీగా ప్రైవేటు వాహనాలు తరలిరావడంతో తలెత్తిన ట్రాఫిక్ సమస్య తలెత్తిందని పోలీసులు తెలిపారు. గంటన్నర లోపు లంకమల క్షేత్రానికి వెళ్లాల్సిన ఆర్టిసి బస్సులు నాలుగు గంటల పైగా పడుతున్న సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తరచూ అవడంతో ఆర్టీసీ బస్సులలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
అత్యధిక సంఖ్యలో...
ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకు అవసరమైన పోలీసులు నియమించకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని భక్తులు చెబుతున్నారు. అధికారుల ముందస్తు చర్యలు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా మారిందని చెబుతున్నారు. ట్రాఫిక్ నిదానంగా కదులుతుండటంతో భక్తులు లంకమలకు చేరుకునేందుకు చాలా సమయం పడుతుందని భక్తులు తెలిపారు. వైయస్సార్ జిల్లా దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన శైవ క్షేత్రమైన లంకమలకు శివరాత్రికి భక్తుల వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు పెదవి విరుస్తున్నారు.