15న చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల భేటీ

టాలీవుడ్ పెద్దలు ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు

Update: 2025-06-12 04:19 GMT

టాలీవుడ్ పెద్దలు ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అంగీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది నుంచి టాలీవుడ్ పెద్దలు ఇంత వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవలేదు. మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని ఇటీవ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ సమావేశానికి రానున్నారు.

ఉండవల్లి నివాసంలో...
ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దాదాపు ముప్ఫయి మంది సినీ ప్రముఖులు హాజరవుతారని అంచనా. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొంటారని తెలిసింది. సినీ పరిశ్రమ కూటమి ప్రభుత్వానికి అభినందనలు చెప్పేందుకు మాత్రమే వస్తున్నారని తెలిసింది.


Tags:    

Similar News