నేడు ఏపీలో నిరుద్యోగుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనకు దిగనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనకు దిగనున్నారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగనున్నాయి. వివిధ పార్టీల అనుబంధ సంఘాలైన విద్యార్థి సంఘాలు ఈ పిలుపు నివ్వడంతో పరిస్థితి టెన్షన్ గా మారనుంది. ఇప్పటికే పోలీసులు విద్యార్థి సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
నోటిఫికేషన్ ను....
గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం లేదు. గ్రూపు 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా నోటిఫికేషన్ విడుదల కావడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.