Janasena : నేడు రెండో రోజు సేనతో సేనాని సమావేశం
నేడు రెండో రోజు సేనతో సేనాని సమావేశం విశాఖ పట్నంలో జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఉదయం పది గంటలకు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు
నేడు రెండో రోజు సేనతో సేనాని సమావేశం విశాఖ పట్నంలో జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఉదయం పది గంటలకు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. వారి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫీడ్ బ్యాక్ ను పవన్ కల్యాణ్ తీసుకోనున్నారు.
రేపు బహిరంగ సభ...
నిన్న విశాఖపట్నంలో జనసేన విస్తృత కార్యవర్గ సమావేశం ప్రారంభమయింది. ఈరోజు కూడా పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. రేపు జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పెద్ద సంఖ్యలో జనసైనికులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్నలు ప్రత్యేకంగా చేపట్టారు.